టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ టీజర్ విడుదలైంది. ఇక వీడియో మాత్రం మాములుగా లేదు. కంప్లీట్ బ్లడ్ బాత్ అని చెప్పవచ్చు. ఇక థియేటర్లో ఈ సినిమాకు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Hungry Cheetah The teaser of OG coming in Pawan Kalyan and Sujith combination is here.
Hungry Cheetah: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సాహో డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ (ఓరిజినల్ గ్యాంగ్ స్టర్). సుజిత్ అంటేనే క్రేజీ యాక్షన్ ఎలివెంట్స్..పైగా ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్. ఇంకేముంది ఓజీ మీద పవన్ అభిమానులకే కాదు. ప్రతి సినిమా ప్రేమికుడికి ఆసక్తి రెట్టింపు అయింది. పాలిటిక్స్, ఇతర సినిమాల షెడ్యూల్ ఉన్నప్పటికీ ఓజీ మూవీ షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ డేట్స్ ఎక్కువ ఇస్తూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ చిత్రం నుంచి ఒక టీజర్‌ను ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా. అది మట్టి చెట్లతో పాటు సగం ముంబాయినే ఊడ్చేసింది. కానీ వాడు నరిక మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫాన్ కడగలేక పోయింది. అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే అంటే సాగే ఈ టీజర్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. దీని వెనుక వచ్చే బీజీ కూడా అద్భుతంగా ఉంది. Hungry Cheetah ఓజీ గ్లింప్స్ అంటూ వచ్చిన ఈ టీజర్ చిరుత వేటాడినట్లే ఉంది.
సుజిత్ స్టైలిష్ మేకింగ్‌తో పవన్ ఓజీ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. 101 సెకన్లు ఉన్న ఈ టీజర్ మాములుగా లేదు. అభిమానులకు నిజమైన ట్రీట్‌లా ఉంది. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఒకే సారి టీజర్‌తో డైరెక్టర్ ఇచ్చి పడేశారు. ఇక టాలీవుడ్ రికార్డులు అన్ని గల్లంతు అవడం ఖాయంగా కనిపిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్(SS Thaman) మ్యూజిక్ అందించారు.