టీమిండియా మాజీ క్రికెటర్, అంబటి రాయుడు (Ambati Rayudu)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPl) నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ (IPL)కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ప్రస్తుత సీజన్లోనే తొలిసారిగా తను సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్(Patriots) జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, మూడు మ్యాచులే ఆడి లీగ్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. కానీ, మూడు మ్యాచులే ఆడి లీగ్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను నిర్వాహకులకు తెలిపారు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాయుడు 47 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే, టోర్నీ(Tournament )నుంచి ఇలా ఉన్నట్టుండి వైదొలగడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్మెంట్ తర్వాత పాలిటిక్స్‌లోకి వస్తానని ప్రకటించిన రాయుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అతను వైసీపీలో చేరి అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో పోటీ చేస్తాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి జగన్ (CMJAGAN)ను కలిసిన రాయుడు ఆయనపై పొడగ్తల వర్షం కురిపించారు. పలు ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకే రాయుడు ఇలా సీపీఎల్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.
చదవండి :INDIA: మా సంస్కృతిని అవమానించారంటూ దీదీపై కామెంట్స్..ముంబై చేరుకున్న కూటమి