Youth Abused Police Because Their Vehicle Dash To The Dogs
Youth Abused Police: హైదరాబాద్ నడిబొడ్డున ఓ యువకుడు (Youth) రెచ్చిపోయాడు. పోలీస్ పెట్రోలింగ్ కారు నడుపుతున్న వ్యక్తిపై విరుచుకుపడ్డాడు. నడిరోడ్డు మీద బూతు పురాణం వినిపించాడు. మరో కానిస్టేబుల్ పక్కకు రా అని పిలిచినా వినిపించుకోలేదు. తాను తిట్టాల్సినవి తిట్టి.. అక్కడ నుంచి కదిలాడు. దానిని వీడియో (video) తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (old mla quarters) ముందు పెట్రోలింగ్ కార్ నంబర్-2 గస్తీ చేస్తున్నారు. డ్యూటీలో భాగంగా వెళతున్నారు. అదే సమయంలో ప్రణయ్ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలతో వెళుతున్నాడు. నిజానికి ఆ కుక్కలను కారు ఢీ కొనలేదు. కుక్కలు వెళుతుంటే.. కారు అడ్డొచ్చిందెమో.. దానికే ప్రణయ్ హంగామా చేశాడు. ఫస్ట్ తాను మంచిగా మాట్లాడానని.. చెబుతున్నాడు. వీడియో తీసుకుంటే తీసుకో.. తనకేం భయం లేదా అన్నట్టు మాట్లాడాడు.
నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై యువకుడి బూతుపురాణం
హైదరాబాద్ – ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.
తన కుక్కలనే (dogs) గుద్దుతావా అని విరుచుకుపడ్డారు. బూతులతో రెచ్చిపోయాడు. 25 సెకన్ల వీడియోలో ప్రణయ్.. హంగామా చేశాడు. పోలీసులు విధులు నిర్వహిస్తుంటే.. యువకుడు ఇలా చేయడం బాగోలేదని అంటున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది.