షారుఖాన్ నటించిన జవాన్ చిత్ర ట్రైలర్ నెట్టింట్లో రచ్చ చేస్తుంటే ఆయన చెప్పిన డైలాగ్పే ట్విట్టర్ బైకాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ట్రైలర్ ఉన్న తప్పేంటో తెలుసా..
Jawan trailer Boycott Bollywood Shah Rukh Khan dialogue to Aryan Khan-Sameer Wankhede case
Jawan trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. అతను నటించిన పఠాన్ చిత్రం భారీ విజయం సాధించింది. దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి కాసులు వర్షం కురిపించింది. తాజాగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఆయన నటించిన జవాన్(Jawan) చిత్రం ట్రైలర్ విడుదల అయింది. పాన్ ఇండియా వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ కూడా విపరీతంగా నచ్చడం కూడా ఒక ఎత్తు అని చెప్పవచ్చు. ఇందులో షారుఖ్ ఖాన్ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బాయ్ కాట్(Boycott Bollywood) బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఒక డైలాగ్ ఉంటుంది. నా కొడుకును టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయండిరా ఇవే మాటలను తన తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేేసుకు సంబంధించిన రిఫరెన్స్ చూపుతున్నారు.
జవాన్ చిత్రంలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేయడంతో కథ తండ్రీ కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుందని ప్రచారం కొనసాగుతోంది. ట్రైలర్ ఎండింగ్లో వచ్చే ఈ డైలాగ్‌ను షారూఖ్ తండ్రి పాత్ర చెబుతుంది. అయితే సహజంగానే ఈ డైలాగ్ షారుఖ్ నిజ జీవితానికి సరిపోతుంది అనిపించక మానదు. ఆర్యన్ ఖాన్ 2021లో డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. నాన్ బెయిలబుల్ నేరం కావడంతో బెయిల్‌పై విడుదలయ్యే ముందు వారాలపాటు విచారణ కొనసాగింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ అధికారి సమీర్ వాంఖడే షారూఖ్ నుంచి లంచం అడిగారనే ఆరోపణలు రావడంతో ఆర్యన్‌కు క్లీన్ చిట్ లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై నెటిజన్లు పలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిధి డోగ్రా, ప్రియమణి తదితరులు నటించారు. ఇందులో దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో కనిపించారు. షారుఖ్, గౌరీ ఖాన్ల రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.
This is a slap on @narendramodi@AmitShah … If you allow this film to show successfully, you visibly surrender to the drug peddler which shows that u and ur agencies are helpless in front of international drug racket … #BoycottBollywoodpic.twitter.com/SAsIjVfAgx