»Indigo Cabin Crew Member Celebrates Raksha Bandhan With Brother Who Is Pilot Of Flight
Indigo Flight: 30వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఫ్లైట్లో రక్షా బంధన్ వేడుక.. వీడియో వైరల్
ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో రాఖీ కట్టింది. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్నా ఎక్కడున్న సోదర సోదరీమణుల బంధం ప్రత్యేకం అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది.
Indigo Flight: తోడ బుట్టిన వారి మమతానురాగాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసే పండుగ రక్షా బంధన్. ఈ రోజు తన తోడ పుట్టిన వాడికి రాఖీ కట్టేందుకు ఎక్కడున్న ఎన్ని కష్టాలు ఎదురైనా వస్తుంది సోదరి. రాఖీ కట్టి తన అన్న కలకాలం ఆనందంగా జీవించాలని ఆశీర్వాదం అందిస్తుంటుంది. అలాంటి రాఖీ పండుగను 30వేల అడుగుల ఎత్తులో గాల్లో జరుపుకుంటే ఎలా ఉంటుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు అదే విమానంలో క్యూబిన్ క్రూ మెంబర్ గా ఉన్న శుభ రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో రాఖీ కట్టింది. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్నా ఎక్కడున్న సోదర సోదరీమణుల బంధం ప్రత్యేకం అంటూ ఈ వీడియోను ఇండిగో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇండిగో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో శుభ ప్రయాణీకులకు తొలుత ఓ సందేశం అందించింది. ఫ్లైట్ ఇంటర్ఫోన్ సిస్టమ్లో అనౌన్స్మెంట్ ఇస్తు.‘‘ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లు అందరికీ సాధ్యపడదు. ముఖ్యంగా మాలాంటి ఉద్యోగులకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకను జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి. ఈ రోజు నాకు అన్న కెప్టెన్ గౌరవ్కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నవ్వుతాం..ఏడుస్తాం… కానీ నాకు మాత్రం నా అన్నే బెస్ట్ ఫ్రెండ్ అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి తన ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారి అభినందించారు.