ASR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. పాడేరు అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రతపై రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.