NTR జిల్లాలో పదో తరగతి రెండో పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 27,215 మంది విద్యార్థులకు గాను 26,951 మంది హాజరయ్యారు. కాగా, 264 మంది గైర్హాజరైనట్లు డీఈఓ చంద్రకళ వెల్లడించారు. జిల్లాలో 99.03 శాతం హాజరు నమోదైందని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు.