CTR: చిత్తూర్ నూతన ఆర్టీసీ బస్టాండ్లో ఇంఛార్జ్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చూడా ఛైర్మన్ కటారి హేమలత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ రూప శ్రీ తదితరులు పాల్గొన్నారు.