TG: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆధునిక సాంకేతికతతో వరద ఉద్ధృతిని అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.