TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన 11 మందిలో ప్రియాంక రెడ్డి ఒకరు. ఈమె ఫిల్మ్ నగర్ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి భార్య అని పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్ పార్టీలో ఆమె పాత్రపై విచారించిన పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెకు బెయిల్ లభించింది. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.