KMR: జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిషిత్ చంద్ర 97.5 మార్కులు సాధించి కామారెడ్డి జిల్లాలో ప్రథమ ర్యాంకు సాధించారని మండల విద్యాధికారి రాజులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.