MNCL: మంచిర్యాలలో రోడ్ల విస్తరణ పేరిట పండుగల వేల వ్యాపారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. బుధవారం ఆయన రోడ్లు విస్తరణ చేస్తున్న ప్రాంతాలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు చేయడం సరికాదన్నారు.