69వ జాతీయ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న అల్లు అర్జున్ కు రామ్ చరణ్, తన భార్య ఉపాసన సర్ ప్రైజ్ చేశారు. పుష్ప నటుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ చెర్రీ, బన్నీ మధ్య మాత్రం ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun receive Ram Charan and Upasana special surprise
తెలుగు స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న సందర్భంగా అనేక మంది ప్రముఖులు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే 2021లో విడుదలైన పుష్ప మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో తన అద్భుతమైన నటనకు గాను మొదటిసారిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న సందర్భంగా అనేక మంది ప్రముఖులు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే 2021లో విడుదలైన పుష్ప మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో తన అద్భుతమైన నటనకు గాను మొదటిసారిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల తనను కలిసి విషెస్ తెలియజేశారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
కానీ రామ్ చరణ్(Ram Charan), అతని భార్య ఉపాసన(Upasana) కొణిదెల అతనికి స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్ పెద్ద విజయాన్ని సాధించినందుకు పెద్ద పుష్పగుచ్ఛాలు, ప్రత్యేక బహుమతిగా పంపిస్తు ఓ నోట్ రాసి అభినందించారు. డియరెస్ట్ బన్నీ… అభినందనలు అంటూ ఓ చిన్ని లేఖ రాశారు. దీంతో అల్లు అర్జున్ కూడా దీనిపై స్పందించి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి “థాంక్యూ సో మచ్ టచ్ డ్ అంటూ పేర్కొన్నారు.
అయితే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పలువురు అంటున్నారు. ఇది ఇంకా తగ్గినట్లుగా అనిపించడం లేదని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ బర్త్ డేకు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ తెలియజేయలేదు. కానీ చెర్రీ మాత్రం బన్నీ పుట్టినరోజున సోషల్ మీడియా(social media) వేదికగా విష్ చేశాడు. దీంతో వీరి మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ ఇంకా సమసినట్లు అనిపించడం లేదని పలువురు అంటున్నారు. పైపైకి మాత్రమే అలా కనిపిస్తున్నారని చెబుతున్నారు.