సలార్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు(prabhas fans). అందుకే సలార్ నుంచి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో అలర్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్(Salaar Trailer) అప్టేట్ మేకర్స్ ఇవ్వకపోయినా.. ముహూర్తం ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది.
వాస్తవానికైతే సలార్(Salaar) టీజర్ రిలీజ్ చేసిన సమయంలో ఆగష్టులో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేశారు హోంబలే ఫిలింస్ వారు. కానీ ఇప్పుడు ఆగష్టు మంత్ ఎండింగ్‌కు వచ్చేసింది. అయినా ట్రైలర్(Trailer) కాదు కదా కనీసం ఫస్ట్ సింగిల్ అప్టేడ్ కూడా లేదు. అయితే సినిమా రిలీజ్‌కు మరో నెల రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రమోషన్స్ చేయాల్సిన సమయం వచ్చేసింది. అందుకే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. సెప్టెంబర్ 7న ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే రోజు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా సలార్ ట్రైలర్ అటాచ్ చేయనున్నట్టుగా టాక్ నడుస్తోంది. అలాగే బెంగుళూరు లేదా ముంబాయిలో గ్రాండ్‌గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.
తెలుగు స్టేట్స్(telugu states)లో మాత్రం ఫ్యాన్స్ మధ్య థియేటర్లలో ట్రైలర్ లాంచ్ చేస్తారని తెలుస్తోంది. కానీ ఒకవేళ కుదిరితే సెప్టెంబర్ 3న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ రెండు తేదీల్లో మాత్రం సలార్ ట్రైలర్ రిలీజ్ అవడం ఖాయమంటున్నారు. ఎందుకంటే..అప్పటి నుంచి లెక్కేస్తే సలార్ సినిమా థియేటర్లోకి రావడానికి మూడు వారాలు మాత్రమే ఉంటుంది. అప్పటికీ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోతే.. ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ హోంబలె ఫిలిమ్స్ పై దండయాత్ర చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ టైం ఫిక్స్ అయిందనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్‌ను హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కట్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అలాగే ట్రైలర్ రన్ టైమ్ వచ్చేసి దాదాపు 140 సెకన్లు అంటే.. 2 నిమిషాల 20 సెకన్లు ఉంటుందని చెబుతున్నారు. రేపో మాపో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.