NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతంలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నవంబర్లో సాగు చేసిన పంట ఇప్పుడు కోత దశకు చేరుకుంది. కోతల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి యంత్రాలు భారీగా వచ్చాయి. సాగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోత పనులు వేగంగా కొనసాగుతున్నాయి.