ATP: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 19.0 మి.మీ వర్షపాతం నమోదైంది. బెలుగుప్పలో 14.6, డి.హీరేహాల్లో 13.4, కూడేరులో 11.2 మి.మీ చొప్పున వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 3.3 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా జిల్లాలోని 11 మండలాల్లో వర్షం కురిసింది.