RR: రంజాన్ తోఫా అనేది కేవలం ముస్లింలకు ఇచ్చే కానుక మాత్రమే కాదని, అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 1000, పురపాలికకు 250 తోఫాలు వచ్చాయని పండుగలోపు ప్రతి ఒక్కరికీ వీటిని అందజేస్తామని తెలిపారు.