AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. నిందితుడు శివకుమార్ నుంచి 2 ఏనుగు దంతాలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ ముఠాపై అధికారులు ఆరా తీస్తున్నారు.