KRNL: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ తలారి అంజీ స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరులోని బీసీ కాలనీలో రైతన్న కోసం కార్యక్రమం నిర్వహించారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు ఏడాదికి రూ. 20,000 జమ చేయడం జరిగిందన్నారు.