KNR: కరీంనగర్ శివారులోని రేకుర్తి కంటి ఆసుపత్రిని ఐడీబీఐ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయ సీఎస్ఆర్ మేనేజర్ మొహమ్మద్ అన్వర్ హుస్సేన్ బుధవారం సందర్శించారు. బ్యాంకు సామాజిక బాధ్యత నిధుల నుంచి ఆసుపత్రికి మంజూరు చేసిన రూ. 74,08,700 వినియోగంపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఛైర్మన్ వేణుమూర్తి, ట్రస్టు సభ్యులు కోల అన్నారెడ్డి ఉన్నారు.