SRCL: బీసీ నేతల ఎదుగుదలను ఓర్వలేకనే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌పై ఆరోపణలు చేశారని రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త సగ్గు పద్మ అన్నారు. చేతికున్న వాచ్‌ను కోట్ల రూపాయలు అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీ సమాజానికి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని మంగళవారం ఓ ప్రకటన ద్వారా ఆమె డిమాండ్ చేశారు.