ప్రకాశం: కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఐదేళ్ల సేవలను స్మరించుకుంటూ వారిని సన్మానించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పేదల సంక్షేమం, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వంటి అంశాల్లో కౌన్సిలర్లు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు.