KRNL: ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీకి 50% రాయితీని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 58 ప్రకారం ఈ నెలాఖరులోపు బకాయిలను ఏకమొత్తంలో చెల్లిస్తే ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేస్తామని చెప్పారు.