KMM: హైదరాబాద్ లోని లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారు నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులను, సుభిక్షాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.