T20 వరల్డ్‌కప్ విజయంలో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడమే కీలకమని రికీ పాంటింగ్ అన్నాడు. ‘సూపర్-8లో దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత సెమీస్ అవకాశాలు క్లిష్టమైన వేళ సూర్య, గంభీర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇషాన్ కిషన్ స్థానంలో శాంసన్‌తో ఓపెనింగ్ చేయించడం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. ఆటగాడిపై నమ్మకం ఉంచడమే భారత్‌ను విజేతగా నిలిపింది’ అని విశ్లేషించాడు.