»Biker Caught With 40 Challans Bengaluru Police Recovered All Money
Challan: బైక్ పై 40చలాన్లు.. యువకుడి నుంచి పోలీసులు ఎన్ని వేల ఫైన్ వసూలు చేశారో తెలుసా?
యువకుడి బైకుపై చాన్ తాడంత చలానా లిస్టు ఉండడం ఫోటోలో చూడవచ్చు. అతనితో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు కూడా ఉన్నట్లు చిత్రాలలో చూడవచ్చు. ఈ యువకుడు ఒకేసారి 40 చలాన్లలోను తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చింది.
Challan: ఒకటి రెండు కాదు ఏకంగా 40 చలాన్లు ఉన్న బైక్‌పై.. తిరుగుతుండగా ఓ వ్యక్తిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ యువకుడి చలాన్ల జాబితాను చూపించే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యువకుడి బైకుపై చాన్ తాడంత చలానా లిస్టు ఉండడం ఫోటోలో చూడవచ్చు. అతనితో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు కూడా ఉన్నట్లు చిత్రాలలో చూడవచ్చు. ఈ యువకుడు ఒకేసారి 40 చలాన్లలోను తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చింది.
ఈ ఫోటోను తల్ఘాట్పురా ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. మొత్తం 40 పెండింగ్ కేసులు ఉన్నాయని రాశారు. వాటిని క్లియర్ చేసేందుకు బైకర్ మొత్తం రూ.12వేలు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు బైకర్‌కు ఇంత ఎక్కువ చలాన్లు జారీ చేశారనేది స్పష్టంగా తెలియలేదు.
దీనిపై ప్రజలు మాట్లాడుతూ.. గొప్పలు చెప్పుకునే పని చేసినట్లుగా జాబితా చూపుతున్నారని అన్నారు. మరో వినియోగదారు పోలీసులపైనే ప్రశ్నలు సంధిస్తూ చలాన్ డబ్బులు వసూలు చేయడం మీ పని కాదని రాశారు. మరో వినియోగదారు కఠినంగా ఉండాలని డిమాండ్ చేశారు. దీనితో ఏమీ జరగదని అలాంటి చలాన్లపై డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని, అలాంటి వారిని డ్రైవ్ చేయడానికి అనుమతించవద్దని అన్నారు. మరొక నెటిజన్ బైకర్‌ను మంచి కస్టమర్‌గా.. బెంగుళూరు పోలీసులకు ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తిగా అభివర్ణించారు. కొంతమంది సోదరుడు 10 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడని రాశారు.