KKD: ప్రత్తిపాడు(మం) బౌరువాక సమీపంలోని పులి సంచరిస్తున్న కారణంగా అటవీశాఖ అధికారులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. పులి పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీశాఖ అధికారులు మంగళవారం తెలియజేశారు. సమీప గ్రామాల ప్రజలు ఎవరు బయటకు రావద్దని వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.