SDPT: హుస్నాబాద్ పట్టణ బస్టాండ్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ కోండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.. పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రత మరింత మెరుగుపడుతుందని ఆయన వివరించారు.