ADB: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేదే తమ మొదటి ప్రాధాన్యత అని సర్పంచ్ అనిల్ అన్నారు. ఆయన మంగళవారం కౌటాల మండలంలోని తాటినగర్ గ్రామంలో పర్యటించారు. చాలా రోజుల నుంచి మూతబడిన చేతి పంపుకు మరమ్మతులు చేసి గ్రామస్థులకు నీటి సౌకర్యం కల్పించారు. ప్రజల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని ఆయన హామీచ్చారు.