»World Most Expensive Grape Ruby Roman Grape Japan
Ruby Roman Grapes: ఈ ద్రాక్షపండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు.
Ruby Roman Grapes:ద్రాక్ష పండ్లు తినని వారు ఉండరు. ద్రాక్ష చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు, అందరూ వీటిని ఇష్టపడతారు. కిలో ద్రాక్ష ధర ఎంత? రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా రికార్డు సృష్టించింది. ఇది మార్కెట్లో దొరకవు. వేలంలో మాత్రమే భారీ ధరకు విక్రయిస్తారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి? వివరాల్లోకి వెళితే…
రూబీ రోమన్ ద్రాక్షగా పిలువబడే ఈ ద్రాక్ష చాలా అరుదుగా పండుతుంది. అందమైన ఎరుపు రంగులో కనిపించే ఈ ద్రాక్షను 2008 నుండి సాగు చేస్తున్నారు. జపాన్‌లోని ఇషికావా ద్వీపంలో పరిమిత సంఖ్యలో వీటిని సాగు చేస్తున్నారు. సీజన్లో మొదటి విక్రయానికి ముందు ద్రాక్ష గుత్తి వేలం వేయబడుతుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు వందలాది మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. 2019 లో కనజావాలో మొదటి ద్రాక్ష గుత్తి వేలం వేయబడింది. జపాన్‌కు చెందిన ఓ కంపెనీ వేలంలో ఈ ద్రాక్ష గుత్తిని దక్కించుకుంది. ఇది రూ. 11 వేల డాలర్లు. ఈ గుత్తిలో మొత్తం 24 ద్రాక్షలు ఉన్నాయి. ఒక్కో పండు 20 గ్రాముల బరువు ఉంటుంది. గత 11 ఏళ్లలో ఈ ద్రాక్షను మార్కెట్లోకి తీసుకొచ్చినా ఇంత ధర ఎప్పుడూ లేదని నిర్వాహకులు తెలిపారు.
ఈ ద్రాక్షకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇది చాలా తీపిగా, చాలా తక్కువ ఆమ్లత్వంతో, రసాలతో నిండి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుంది. వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతులుగా కొనుగోలు చేస్తారు. కొన్ని హోటళ్లు తమ అతిథుల కోసం వీటిని కొనుగోలు చేస్తాయి. ధనవంతులు దీనిని విలాసవంతమైన పండుగా కొనుగోలు చేస్తారని చెబుతారు. రూబీ రోమన్ ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా రికార్డు సృష్టించింది. అలాంటి ద్రాక్షను కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.