యాంకర్ అనసూయ (Anasuya) ప్రస్తుతం యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంఎప్పుడూ సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఆమె బోరున విలపిస్తూ ఎమోషనల్ పోస్ట్ (Emotional post) చేశారు. ‘ప్రపంచంలో ఎంత గొప్పవాళ్లకైనా బాధలు ఉంటాయి. ఫొటో షూట్లు(Photo shoots), నవ్వులు అన్నీ నా జీవితంలో భాగమే.. అలాగే నా లైఫ్లో కొన్నిసార్లు చాలా వీక్ గానూ ఉన్నాను.. కొందరు నాకు యాటిట్యూడ్ (Attitude) ఉందనుకుంటారు. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తా. కొన్ని సందర్భాల్లో బాగా ఏడ్చి మళ్లీ మామూలైపోతా.. అందరూ దయతో ఉండండి’ అని ఏడ్చిన వీడియోను షేర్ చేశారు.
అలాగే ఇది అయిదు రోజుల క్రితం వీడియో అని, ఏడ్చేటప్పుడు అలా రికార్డ్ చేసి ఉంచుకున్నాను అని, ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అని తెలిపింది అనసూయ. దీంతో వీడియో వైరల్ గా(Video viral) మారింది. అయితే దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మీరు ఏడవకండి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇప్పుడు మళ్ళీ ఎవర్ని గెలికావు, ఎవరు ఏమన్నారు అని కామెంట్స్ చేస్తుంటే పలువురు ఇదంతా పబ్లిసిటీ (Publicity)స్టంట్, ఇలా ఏడ్చే వీడియో ఎవరూ పెట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అనసూయ ఈ ఏడ్చే వీడియో ఎందుకు పెట్టిందో కానీ మరోసారి అనసూయ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.