టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా (Rivaba Jadeja) మునిసిపల్ మేయర్ బినా కొతారి, ఎంపీ పూనంబెన్ మాదం(Poonamben Maadam)తో గొడవకు దిగారు. గుజరాత్లో ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా, ఎంపీ, మున్సిపల్ మేయర్‌తో వాగ్వాదం పెట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై రివాబా జడేజా స్పందిస్తూ… అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం (MP Poonamben Madham) చెప్పులు విప్పకుండానే నివాళులు అర్పించారని అన్నారు. తాను అమర జవాన్లకు నివాళులు అర్పించే ముందు పాదరక్షలు (Footwear) విప్పానని తెలిపారు. ఆ తర్వాత అక్కడున్న వారంతా తనను చూసి తనలాగే పాదరక్షలు విప్పి నివాళులు అర్పించారని అన్నారు. ఆ సమయంలో తనను ఎద్దేవా చేస్తూ ఎంపీ పూనంబెన్ కామెంట్స్ చేశారని, తెలివి మించిపోయిందని తనను అన్నారని రివాబా జడేజా తెలిపారు. ఆ వ్యాఖ్యలు తనకు వినపడ్డాయని చెప్పారు.
ఇటువంటి కార్యక్రమాల్లో రాష్ట్రపతి(President), ప్రధాని కూడా పాదరక్షలు విప్పరని ఆ ఎంపీ అన్నారని వివరించారు. దీంతో తాను ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆ సమయంలో మేయర్ బినా కొతారీ అనవసరంగా జోక్యం చేసుకుని ఎంపీకి మద్దతుగా మాట్లాడడానికి ప్రయత్నించారని చెప్పారు.. అదే సమయంలో అక్కడే ఉన్న మేయర్ బినా కొతారీ (Mayor Bina Kothari) అనవసరంగా జోక్యం చేసుకుని ఎంపీకి మద్దతుగా మాట్లాడడానికి ప్రయత్నించారని రివాబా జడేజా తెలిపారు. ఈ క్రమంలోనే తనకు కోపం వచ్చిందని.. తన పార్టీ నేత అయినప్పటికీ ఆమెకు కౌంటర్ ఇచ్చినట్లు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ (video viral) కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎంపీ పూనంబెన్ మాదం.. వివరణ ఇచ్చుకున్నారు. ఇది తమ పార్టీ నేతల మధ్య చిన్న అభిప్రాయ బేధానికి సంబంధించిన విషయమని తెలిపారు. అదే సమయంలో తామంతా ఒకటేనని పార్టీ ఒక కుటుంబం (family) లాంటిదని పేర్కొన్నారు.