పెళ్లి వేడుకలో ఫొటో షూట్లో వెళ్లిన ఫొటో గ్రాఫర్ (Photographer) డ్యాన్స్‌తో అలరించారు. వివాహ కార్యక్రమంలో భాగంగా అతిథులు డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో వారితో చేరి తనదైన స్టైల్లో (Style)స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. చేతులతో కెమెరాను బ్యాలెన్స్ చేస్తూనే.. పంజాబీ బీట్స్ (Punjabi Beats) అదిరిపోయే స్టెప్పులేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివాహ వేడుకలో కెమెరామెన్ (Cameraman) సాదారణంగా ఫోటోలు తీస్తుంటాడు. ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తుంటాడు.
కానీ, ఓ ఫొటోగ్రాఫర్ మాత్రం బంధువులతో కలిసి అదిరిపోయే స్టెప్పులు (Steps) వేశాడు. దీంట్లో విచిత్రం ఏముందనుకుంటున్నారా..ఒక వైపు తన పని చేసుకుంటూనే.. మరోవైపు అతిథులతో కలిసి పంజాబీ పాటకు ఉత్సాహంగా చిందులు వేస్తూ వీడియో తీశాడు. తన ప్రదర్శనతో వేడుకలో మరింత నవ్వులు పూయించాడు. కెమెరాను వదలకుండా ఫ్లోర్‌పై అద్భుతంగా డ్యాన్స్ (Dance) చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్(Video viral)గా మారింది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఇలాంటి కెమెరామెన్ ప్రతి వేడుకలో ఉంటే నవ్వులే నవ్వులు అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.