ఆర్బీఐ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వడ్డీల రూపంలో అధిక పెనాల్టీలు విధించే బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేది నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని ప్రకటించింది.
ఆర్బీఐ (RBI) కోట్లాది మంది భారతీయులకు శుభవార్త చెప్పింది. రుణాలు తీసుకున్న వారికి పెనాల్టీ, వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలను మారుస్తూ ప్రకటన చేసింది. రుణ ఖాతాలపై జరిమానా విధించడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త రూల్స్ (New Rules) అమలలోకి రానున్నాయి. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు అన్ని బ్యాంకులకు వర్తించనున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారంగా..లోన్ (Loan) తీసుకున్న వారికి డిఫాల్ట్ అయినప్పుడు ఆ వ్యక్తికి జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలని ఆర్బీఐ తెలిపింది. అయితే వారికి జరిమానాను వడ్డీల రూపంలో చెల్లంచకూడదని వెల్లడించింది. కొన్ని బ్యాంకులు వడ్డీల రూపంలో తమ ఆదాాయాన్ని పెంచుకునేందుకు అనేక మందికి ఛార్జీల రూపంలో వడ్డీలు విధిస్తూ వస్తున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వడ్డీలకు మరే ఇతర భారాలను విధించకూడదని ఆర్బీఐ (RBI) తేల్చి చెప్పింది. కొత్త రూల్ 2024 జనవరి 1వ తేది నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది.
మరో విషయం ఏంటంటే ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ రూల్ క్రెడిట్ కార్డులు (credit Cards), వాణిజ్య రుణాలకు వర్తించదని వెల్లడించింది. బ్యాంకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించి ఏదైనా చర్యలకు పాల్పడితే వారికి భారీ జరిమానాతో పాటు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. కొత్త రూల్ ప్రకారంగా లోన్ తీసుకున్న వారిని వేధించకూడదని, ఈఎంఐ (EMI’s) విషయంలో వారిని ఇబ్బంది పెట్టకూడదని, అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.