ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కాన్వాయ్కి ప్రమాదం (Accident) జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ శనివారం ఉదయం తన కాన్వాయ్‌తో హైదరాబాద్(Hyderabad)కు బయల్దేరి వెళ్లారు. అయితే తెలంగాణ (Telangana)లోని సూర్యాపేట వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద కారు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న 65వ జాతీయ రహదారిలో వెనక వస్తున్న వాహనం ఢీకొంది.
కాన్వాయ్ లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి (Accident). అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలేవీ కాలేదు. రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతినడంతో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వేరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రమాదంలో ఆయనకు గాయాలేవి కాలేదు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం వల్లభేనేని వంశీ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.