Cop కానిస్టేబుల్ కావరం.. చికిత్స కోసం వచ్చిన రోగిపై దాడి
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించాడు. తలకు కట్టు కట్టుకొని ఉన్న రోగిని లాఠీతో కొట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Constable Attack: ఓ కానిస్టేబుల్ (Constable) తన ప్రతాపాన్ని చూపాడు. రోగి అని కూడా చూడకుండా చావగొట్టాడు. ఆస్పత్రిలో.. తలకు కట్టు కట్టుకున్న వదల్లేదు. వద్దు అని చెబుతోన్న సరే.. వినిపించుకోలే.. అక్కడున్న ఒకరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో (social meida) షేర్ చేశారు. ఇంకేముంది వైరల్ అయ్యింది. ఆ కానిస్టేబుల్ సత్యనారాయణ తీరును నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. ఎందుకీలా చేశారని ఫైర్ అవుతున్నారు.
కరీంనగర్‌కు చెందిన సతీష్ (satheesh) అనే వ్యక్తి ఇంట్లో గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు 100కు డయల్ చేశారు. పోలీసులు వచ్చే సమయానికి సతీష్ (satheesh) గాయాలతో ఉన్నాడు. అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. తలకు కట్టు కూడా ఉంది. ఇంతలో సతీష్- కానిస్టేబుల్ సత్యనారాయణకు గొడవ జరిగింది. ఏం జరిగిందో ఆ వీడియోలో లేదు.. కానీ కానిస్టేబుల్ (constable) తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఓయ్.. అంటూ రంకెలు వేశాడు. సమయం దొరికితే చాలు.. అతని చితక్కొట్టాడు.
చికిత్స కోసం వచ్చిన యువకుడిపై కానిస్టేబుల్ దాడి
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిని చితకబాదిన ఔట్ పోస్టు కానిస్టేబుల్. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ జరగడంతో అతని కుటుంబ సభ్యులు 100కు డయల్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి… pic.twitter.com/1IjMnTd2Mp
మీది టు టౌన్ కిందకు రాదు కదా అని అడగ్గా.. టు టూన్ పోలీస్ స్టేషన్ మాది అన్నారు. వెనకాల లాఠీతో కొట్టాడు. అతను పేషంట్ అని కూడా చూడలేదు. కానిస్టేబుల్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఖాకీ.. ఓ రోగితో ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మీ తీరేం బాగో లేదు.. మార్చుకోవాలని అని సూచిస్తున్నారు.