నల్లగొండ, మీర్భాగ్ కాలనీలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు మంగళవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగానికి, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. మతసామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.