ప్రముఖ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ఇండస్ట్రీలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నాడు. గత ఏడాది ‘జిన్నా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూవీ ప్రకటించలేదు. ఆయన ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కలల చిత్రం భక్త కన్నప్ప(Bhakta Kannappa)ని రూపొందించాలని ప్రణాళికలు రచించుకుంటుండగా,ఎట్టకేలకి ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఏకంగా పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేసేశాడు విష్ణు. కృష్ణంరాజు (Krishna Raja) హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కించడానికి ఇప్పటి మేకర్స్ చాలామంది బాగా ట్రై చేశారు.‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu)ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన కథానాయికగా నటించనుంది.‘‘స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని దర్శకత్వం చేయనున్నాడు. సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దగా, చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) నిర్మించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో మొత్తం కంప్లీట్ చేస్తామని, చిత్రీకరణ మొత్తం కూడా న్యూజిలాండ్ (New Zealand) లో జరగనుందని విష్ణు తెలియజేశాడు. తరతరాలు గుర్తు పెట్టుకునేలా భక్త కన్నప్ప సినిమాని నిర్మిస్తామని మోహన్ బాబు పేర్కొన్నాడు.