యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇందులో హీరోగా నిరంజన్ నటించారు.