మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడిపడి మహిళా అదనపు సెషన్స్ జడ్జిపై పడింది. దీంతో మహిళా న్యాయమూర్తి తలకు, భుజానికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.