ASR: బాల్యవివాహాల నివారణకు అవగాహన కల్పించేందుకు “10 తరవాత 11 ముద్దు, పెళ్లి వద్దు” అనే కార్యక్రమం డుంబ్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం జరిగింది. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా.కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఆడపిల్లల చదువు కుటుంబానికి, సమాజానికి వెలుగునిస్తుందని తెలిపారు.