Jetpack Suit: భారత సైన్యానికి జెట్ప్యాక్ సూట్లు..వీడియో వైరల్
భారత ఆర్మీ స్పెషల్ జెట్ప్యాక్ సూట్లు ధరించనుంది. తాజాగా సైనికులు ఈ ప్రత్యేక సూట్‌ను టెస్ట్ చేశారు. గాలిలో ఎగురుతూ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
భారత ఆర్మీ సైనికులు (Indian Army soldiers) ఇకపై జెట్ప్యాక్ సూట్ల (Jetpack suits)ను ధరించనున్నారు. జవాన్లు జెట్ విమానాల మాదిరిగానే గాలిలో ఎగిరి టెస్ట్ చేయగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. స్పెషల్ ఫోర్సెస్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్లో కొత్త జెట్ప్యాక్ సూట్ పరీక్షలను చేపట్టింది. ఈ టెస్ట్‌లో పారా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఐరన్ మ్యాన్ మాదిరిగానే జెట్ప్యాక్ సూట్లను ధరించారు. విజయవంతంగా ఈ టెస్ట్‌ను రన్ చేశారు.
New jetpack suit is being tested by Para SF at Army Airborne Training School, Agra pic.twitter.com/R6mlDHUvdM
అంతర్జాతీయ సరిహద్దుల్లో వినియోగించేందుకు భారత సైన్యం పారా స్పెషల్ ఫోర్సెస్ (Indian Para special Forces) సూట్లను కొనుగోలు చేయగా వాటిని ఆగ్రాలోని ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్లో జెట్ప్యాక్ సూట్ (jetpack suit) పరీక్షలను చేపట్టింది. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఆ వీడియోకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ ఆర్మీ యుద్ధ పరికరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం అని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ఎత్తైన ప్రదేశాల్లో డ్యూటీ చేసే సమయంలో ఈ స్పెషల్ జెట్ప్యాక్ సూట్ (jetpack suit)లు చాలా అవసరం అవుతాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బ్రిటీష్ వ్యాపారవేత్త, గ్రావిటీ ఇండస్ట్రీస్ సీఈఓ రిచర్డ్ బ్రౌనింగ్ తన జెట్ప్యాక్ సూట్‌ను ధరించి ప్రదర్శన చేశారు. ఆ డెమో సూట్‌తో గాలిలో ఎగిరి చూపించారు. ఆ ప్రత్యేక సూట్ ధరిస్తే గంటకు 51 కిలోమీటర్ల వేగంతో ఎగరవచ్చు. ఈ జెట్ప్యాక్ బరువు 40 కిలోలు ఉంటుందని, దాని బరువుకు రెండింతలు ఎక్కువ ఉన్న అంటే 80 కిలోల బరువున్న మనిషితో అది ఎగురుతుందని వెల్లడించారు. మార్కట్లో ఈ సూట్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సూట్ ధరను మాత్రం సైన్యం వెల్లడించలేదు.