బర్గర్ కింగ్‌లో పనిచేసే ఫోర్డ్ అనే వ్యక్తి.. గత 27 ఏళ్లుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పనిచేశాడు. ఆ విషయాన్ని అతని కూతురు వీడియోలో చెప్పి.. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Ford: ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒంట్లో బాగోలేకుంటెనో.. ఇంట్లో ఎవరికన్నా బాగోలేకుంటే.. లీవ్ పెడతాం. కంపెనీని బట్టి సీఎల్స్, పీఎల్స్ కూడా ఉంటాయి. అయితే ఒకతను 27 ఏళ్ల కెరీర్లో ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. ఆ విషయాన్ని టిక్ టాక్ వీడియోల్లో అతను చెప్పేశాడు. అతనికి గిప్ట్స్, లేదంటే కామెంట్స్ సరిపోవని నెటిజన్లు రాశారు. దీంతో అతని కూతురు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేపట్టింది. వీడియో పోస్ట్ చేయగా.. అందరూ స్పందించి డబ్బులు పంపించారు.
మనం ఇందాక చెప్పుకుంది ఫోర్డ్ (Ford) అనే వ్యక్తి గురించి. ఇతను అమెరికాలో గల లాస్ వేగాస్ మెక్ కెరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గల బర్గర్ కింగ్‌లో పనిచేససేవాడు. గత 27 ఏళ్ల నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. విధుల పట్ల అతని అంకితభావాన్ని ఉద్యోగులు మెచ్చారు. చాక్లెట్లు, పెన్నులు, స్వీట్, స్టార్ బక్స్ కప్, ఇతర వస్తువులు అందజేశారు. ఆ వీడియోను ఫోర్డ్ టిక్ టాక్‌లో షేర్ చేయగా.. జీవితాన్ని త్యాగం చేశాడని బహుమతులు సరిపోవని నెటిజన్లు కామెంట్ చేశారు. దీంతో అతని కూతురు తన తండ్రి గురించి వీడియోలో చెబుతూ.. ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేపట్టింది.
ఫోర్డ్ (Ford) జీవితంలో పడ్డ కష్టాలను తెలుసుకొని చాలా మంది చలించిపోయారు. అతనికి భార్య లేకున్నా.. ఇద్దరు కూతుళ్లను పెంచి పోషించారని తెలుసుకున్నారు. అందుకోసం చాలా కష్టపడ్డారని చెబుతూ.. ఫండ్స్ (Funds) అందజేశారు. ఇలా రూ.3.48 కోట్ల మొత్తం విరాళాల రూపంలో వచ్చాయి. భారీగా డబ్బులు రావడంతో అతని కళ్లలో సంతోషం కనిపించింది. ఆ డబ్బుతో కలలను సాకారం చేసుకుంటానని.. మిగిలిన డబ్బును పిల్లల కోసం ఖర్చు చేస్తానని వివరించారు. సంతోష సమయంలో పదవీ విరమణ చేస్తున్నానని ప్రకటించారు. నిజమే నెల కాదు 2 నెలలు కాదు.. ఏకంగా 27 ఏళ్లు ఏకధాటిగా పనిచేయడం అంటే మాములు విషయం కాదు. హ్యాట్సాప్ టు ఫోర్డ్.