KNR: శంకరపట్నం మండలం మెట్పల్లి రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. జమ్మికుంట KVK కోఆర్డినేటర్ డా. ఎన్. వెంకటేశ్వర్ రావు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, ప్రయోజనాలను వివరించారు. మొలంగూర్ క్లస్టర్‌కు చెందిన 125 మంది రైతులకు కిట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.