NLG: MGU పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 821 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 24 మంది ప్రమోట్ కాగా, 246 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి (సీవోఈ) జి. ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.