»Venu Swamy Sensational Comments Another Tollywood Couple Is Divorced
Venu Swamy: సంచలన కామెంట్స్.. ఈ జంట కూడా విడిపోతుంది!
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి(Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. ముఖ్యంగా ఫలానా జంట విడిపోతుంది.. కలిసి ఉండలేరు.. విడాకులు తీసుకుంటారు అని చెబుతుంటాడు. తాజాగా మరో టాలీవుడ్ కొత్త జంట కూడా విడిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
Venu Swamy Sensational Comments another tollywood Couple Is Divorced
మామూలుగా అయితే వేణు స్వామి(Venu Swamy) చెప్పేది సెలబ్రిటిష్ పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన చెప్పేది అప్పుడప్పుడు నిజం అవుతుండడంతో.. సెలబ్రిటీస్ అంతా ఆయన వెనకలా పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్నారు. రష్మిక, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అతనితో పరిహార పూజలు చేయించుకున్నారు. అందుకు సంబంధించిన ఎన్నో వీడియో సోషల్ మీడియాలో ఉన్నాయి. మొత్తంగా ఈ జ్యోతిష్యుడు చెప్పే హీరో, హీరోయిన్ల జాతకాలు ఎప్పటికప్పుడు హాట్ టాపికేనని చెప్పాలి. రీసెంట్గా నిహారిక రెండో పెళ్లి గురించి కూడా కామెంట్స్ చేశాడు. త్వరలోనే నిహారిక రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని, దానిలో కూడా ఆమెకు కాస్త చికాకులు, చిక్కులు తప్పవని.. పిల్లల విషయంలో నిహారిక కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని జాతకం చెప్పాడు వేణు స్వామి.
అయితే గతంలో ఈయన చెప్పినట్లుగానే సమంత, నాగచైతన్య.. నిహారిక, చైతన్య విడిపోయారు. ఇక ఇప్పుడు మరో స్టార్ జంటపై షాకింగ్ కామెంట్స్(comments) చేశాడు. సమంత, చైతన్యలాగే ఆది పిని శెట్టి(adi pini shetty), నిక్కి గల్రానీ(nikki galrani) కూడా విడిపోతారంటూ జోష్యం చెప్పుకొచ్చాడు. వీరి జాతకం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. వీరిద్దరు కలిసి ఉండటం సర్వసాధారణమని.. 80 శాతం డివోర్స్ తీసుకునే అవకాశం ఉందని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారాయి. రీసెంట్‌గానే ఆదిపినిశెట్టి, నిక్కీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దర హ్యాపీగానే ఉన్నారు. మరి ఇప్పుడు వేణు స్వామి జోష్యంతో ఎలాంటి ఆటంకాలు వస్తాయో చూడాలి.