»Rajinikanth Jailer Rs 450 Crore Worldwide In A Week Fastest Film In History To Cross Rs 150 Crore In Tamil Nadu
Jailer: రూ.500 కోట్లకు అడుగు దూరంలో జైలర్..వీక్ డే కలెక్షన్లు
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం జైలర్ సినిమా కలెక్షన్లను చూస్తే ట్రేడ్ పండితులకే మైండ్ పోయేలా ఉంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్‌స్టార్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఇక తమిళనాడులో అత్యంత వేగంగా రూ.150 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
Rajinikanth Jailer Rs 450 crore worldwide in a week, fastest film in history to cross Rs 150 crore in Tamil Nadu
Jailer: సూపర్ స్టార్(Super Star) రజినీకాంత్(Rajanikanth) నటించిన తాజా చిత్రం జైలర్(Jailer) రికార్డులను తిరగరాస్తుంది. నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileepkumar) తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న విడుదలైంది. మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్‌ను సొంత చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్లపరంగా జోరును చూపిస్తోంది. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల నెట్ ప్రాఫిట్ మార్క్‌ను దాటింది. అంతే కాకుండా ఏడవ రోజు థియేటర్లలో దేశవ్యాప్తంగా రూ.15 కోట్లను రాబట్టి ఇండస్ట్రీ ట్రాక్ రికార్డును నెలకొల్పింది. దీంతో ఒక్క వారంలో ఈ సినిమా రూ.225.65 కోట్ల నెట్ ప్రాఫిట్‌కు చేరింది. అలాగే బుధవారం 42.43% ఆక్యుపెన్సీని సాధించింది జైలర్ చిత్రం.
జైలర్ (Jailer) చిత్రం ఓపెనింగ్ డే రూ.48.35 కోట్లతో భారీగా ప్రారంభమైంది. రెండవ రోజు, ఈ చిత్రం చిరంజీవి భోళా శంకర్ నుంచి కొంత పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. జైలర్ దక్షిణాది రాష్ట్రాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తుండగా, ఉత్తరాది రాష్ట్రాలలో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన గదర్ 2(Gadar 2) ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది ఇప్పటికే పఠాన్ తర్వాత సంవత్సరంలో రెండవ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకారం, జైలర్ ప్రపంచవ్యాప్తంగా రూ.450.80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం తొలిరోజు రూ.95.78 కోట్ల షేర్ వసుల్ చేసింది. అంతేకాకుండా తమిళనాడులో ఈ సినిమా రూ.159.02 కోట్లు రాబట్టి.. ఇంకా దూసుకుపోతుంది. తమిళ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా ఏడు రోజుల్లో రూ.150 కోట్లకు చేరుకున్న సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది.