మెగా హీరో రామ్ చరణ్ (RamCharan), ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు క్లింకార (Klinkara) ఫొటో కోసం ఎదురుచూస్తున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ తన ఇన్‌స్టా ఖాతా(Insta account)లో షేర్ చేసింది.అందులో ఫ్యామిలీ అంతా హ్యాపీ మూమెంట్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కనిపించింది. క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో చాలా హృద్యంగా చూపించారు.
ద్రావిడ సంస్కృతిలో తన పాప భాగం కావాలని కోరుకున్నట్టు ఉపాసన (upasana) చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరు కూడా క్లింకార పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వొద్దని కోరింది. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని తాము భావిస్తున్నట్టు పేర్కొంది.తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి తొలిసారి ఇండిపెండెన్స్ డే (Independence Day)సెలబ్రేషన్స్ జరుపుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలు ఉపాసన షేర్ చేయగా, ఆ పిక్స్ లో క్లింకార ఫేస్ కొంత మాత్రమే కనిపిస్తుంది. సైడ్ యాంగిల్లో కాస్త కనిపిస్తుండగా, అందరు కూడా రామ్ చరణ్ పోలికలతో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అయితే క్లింకార పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా, బ్రో మూవీ ప్రమోషన్స్ లో మెగా ప్రిన్సెస్ గురించి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).. క్లింకారకి ఎవరి పోలికలు వచ్చాయో చెప్పాడు. ‘క్లింకార అచ్చం రామ్‌చరణ్ లాగే ఉందని, కళ్లు చాలా బాగున్నాయని అన్నాడు. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు కదా, క్లింకార విషయంలోనూ అదే జరిగింది అని అన్నాడు సాయి ధరమ్.