వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రెచ్చిపోయారు టిడిపి నేత దేవినేని ఉమా(Devineni Uma). వర్మపై దేవినేని తిట్ల పురాణం అందుకున్నారు. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)ఓ దగుల్బాజీ, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వాళ్లు ఉండబట్టే రాష్ట్ర నాశనం అవుతుందన్నారు. సినిమా ద్వారా ప్రజలకు వాస్తవం చెప్పరా దరిద్రుడా..! అంటూ మండిపడ్డారు.అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా..? వర్మ అని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu) కష్టం, పట్టిసీమ గొప్పతనం సినిమా తీయాలన్నారు. దమ్ముంటే ఈ విషయాలు సీఎం జగన్ (CM Jagan) కు చెప్పమని సూచించారు దేవినేని ఉమా. పట్టిసీమ లాంటి పవిత్ర స్థలంలో సినిమాలు తీస్తున్నాడని.. వర్మ నీకు బుద్ది, జ్ఞానం ఉందా..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవటానికి సీఎం జగన్ ఆర్జీవీతో సినిమాలు తీయిస్తున్నాడని ఆరోపించారు.
మిక్కీమౌస్ బొమ్మతో నిలబడ్డ ఫొటోను ట్వీట్ చేసిన ఆర్జీవీ.. దేవినేని ఉమాను ట్యాగ్ చూస్తే ‘ఉమ్మా……..’ అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా చివర్లో ఓ కిస్ ఎమోజీని పెట్టాడు. ఈ ట్వీట్ వైరల్‌గా(tweet viral) మారింది. దీనిపై వందలాది మంది అభిమానులు రియాక్ట్ అయ్యారు. టీడీపీ (TDP) కార్యకర్తలు, దేవినేని వీరాభిమానులు వర్మపై తిట్లపురాణం మొదలెట్టేశారు. దీంతో ఉదయం విమర్శలు గుప్పించిన ఉమ.. మరోసారి ట్విట్టర్‌కు పనిచెప్పారు. బురదలో ఉన్న పంది బొమ్మను చూపిస్తూ పందిపై ఆర్జీవీ అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘హాయ్ రాంగోపాల్ కర్మయ’ అంటూ ఉమ పోస్ట్ చేశారు.
నిన్న మొన్నటి వరకూ ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేరీతిలో టీడీపీ నుంచి దిమ్మతిరిగే కౌంటర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉమా తన గురించి మాట్లాడటంతో ఇలా రియాక్ట్ అవ్వడం.. దీనికి మళ్లీ కౌంటర్ రావడంతో అటు టాలీవుడ్(Tollywood)లో.. ఇటు ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి చూస్తే.. ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు.ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ‘వ్యూహం’ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. దీనికి కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ‘వైఎస్ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఇందులో చెబుతాం. వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉందని ఆర్జీవీ తెలిపారు.