TG: మాజీ మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తే కేటీఆర్ రాజీనామా చేస్తానన్నారని.. తాము ఆధారాలు చూపేందుకు సిద్ధంగా ఉన్నామని సీతక్క తెలిపారు. మాట మీద నిలబడే వ్యక్తి కేటీఆర్ అయితే.. రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆక్షేపించారు.